సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఒక దశలో హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గిపోతాయి అంటుంటారు. ముఖ్యంగా పెళ్లికి సిద్ధమవుతోంది అంటే చాలు వచ్చిన ఛాన్సులు కూడా గాలిలో కలిసిపోతాయనే టాక్ కూడా ఉంది. అయితే ఇదంతా గతంలోనే అంటూ ఇప్పుడు మాత్రం పెళ్లితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయని ప్రియమణి వివరణ ఇచ్చింది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి అందుకు ఉదాహరణ సమంత అని తెలిపింది. నిజంగా పెళ్లి చేసుకున్న తరువాత కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ తన టాలెంట్ తో ఆకట్టుకుంటున్న సమంత ట్రెండ్ ఫాలో అవ్వకుండా కొత్తగా సెట్ చేసినట్లు తెలియజేసింది. తాను కూడా పెళ్లి అనంతరం నటనకు ప్రాధాన్యం ఇచ్చే మంచి ఛాన్సులు అందుకుంటున్నాను అంటూ విరాటపర్వం, నారప్ప సినిమాలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. అదే విధంగా నెపోటిజమ్ పై స్పందించిన ఈ సినియర్ బ్యూటీ వారసత్వం ద్వారా స్టార్ కిడ్స్ ఈజీగా అవకాశాలు అందుకోవచ్చు గాని అంచనాలు తగ్గట్టుగా అంధరికంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని, ఒక విధంగా అది అదృష్టం అనుకుంటే మరొక విధంగా శాపమని ప్రియమణి తెలిపింది.