నాని సమంత సినిమా రూమర్ మాత్రమే… వాటిని నమ్మకండి

నేచురల్ స్టార్ నాని, అక్కినేని కోడలు సమంతలు ఇప్పటికే ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చారు. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని, త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ హల్చల్ చేసింది. నానితో నిన్ను కోరి, సమంతతో మజిలీ లాంటి సినిమాలు చేసి హిట్ అందుకున్న శివ నిర్వాణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని కూడా న్యూస్ వైరల్ అయ్యింది.

సోషల్ మీడియా అంతా ఆ పోస్టర్ వైరల్ అవడంతో, అలర్ట్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణ… బయట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేశాడు. తన నెక్స్ట్ సినిమా వివరాలు త్వరలో తానే అనౌన్స్ చేస్తానని శివ ట్వీట్ చేయడంతో నాని, సమంత సినిమా చేస్తున్నారు అనే వార్త ఉత్త రూమర్ గానే మిగిలిపోయింది.