ముద్దులతో రెచ్చిపోతున్న సమంత

సినిమాలతో పాటు టాక్ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని కోడలు సమంత ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ ఫొటోలతో సమంత సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. గతంలో భర్త నాగచైతన్యతో కలిసి మాల్ధీవులకు చెక్కేసిన సమంత.. అక్కడే చైతూ బర్త్ డే సెలబ్రేట్ చేసింది. మాల్ధీవుల బీచ్‌లలో బికినీలలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి అప్పుడు బాగా వైరల్ అయ్యాయి.

SAMANTHA AND NAGA CHAITANYA

ఇక న్యూఇయర్ సందర్భంగా చైతూతో కలిసి గోవా వెళ్లిన సమంత… అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. చైతూని ఆలింగనం చేసుకుని బుగ్గపై ముద్దిచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రొమాంటిక్ కపుల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఫొటోకు కేవలం మూడు గంటల్లోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి.

ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో సమంత ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సమంత టైటిల్ రోల్ పాత్రలో నటించనుంది. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా శాకుంతలం మోషన్ పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించనున్నాడు. పాన్ ఇండియాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.