Samantha: సమంతకు అరుదైన ఘనత

Samantha: టాలీవుడ్‌తో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. సమంత ఫొటోతో ట్విట్టర్‌లో కొత్తగా ఎమోజీ వచ్చింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచింది. #TheFamilyMan2 అని ట్విట్టర్‌లో టైప్‌ చేస్తే… సమంత ఎమోజీ కనిపించనుంది. తొలిసారిగా ద ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్‌సిరీస్‌లో సమంత నటించింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న మనోజ్ బాజ్‌పేయితో కలిసి సమంత ట్విట్టర్ ఎమోజీ దక్కించుకుంది.

samantha emoji twitter

అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 12 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత విలన్‌గా నటించింది. రాజ్, డీకే‌లు ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించగా.. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఈ ఎమోజీపై సమంత ఆనందం వ్యక్తం చేసింది.