మొన్న బిగ్‌బాస్.. ఇప్పుడు మరో షోతో స్యామ్

అక్కినేని కోడలు సమంత మరో షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఇటీవల తన మామ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలీ వెళ్లడంతో దసరా సందర్భంగా బిగ్‌బాస్-4కు సమంత హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ షోకు 11.6 టీఆర్‌పీ రేటింగ్ రాగా.. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నప్పుడు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ కంటే ఇది చాలా ఎక్కువమని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున హోస్టింగ్ చేస్తున్నప్పుడు 7 రేటింగ్ మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు.

దసరా రోజున ప్రసారం అయిన సమంత బిగ్‌బాస్-4 ఎపిసోడ్ సూపర్ హిట్ కావడంతో ఆమెతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ టాక్‌షో చేయిస్తోంది. ఇప్పటికే నాగచైతన్య, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తమన్నాలతో నాలుగు ఎపిసోడ్‌లు షూట్ చేసినట్లు సమాచారం. దీపావళి రోజున ఇవి ‘ఆహా’ యాప్‌లో స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ టాక్‌షో షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందట. బిగ్‌బాష్ ఒక్క ఎపిసోడ్‌తోనే వ్యాఖ్యాతగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సమంత.. ఈ టాక్‌షోతో మరింత అలరిస్తుందని చెప్పవచ్చు. సమంత ముద్దు ముద్దు మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ టాక్ షోతో అటు హీరోయిన్‌గానే కాకుండా ఇటు వ్యాఖ్యాతగా కూడా సమంత గుర్తింపు పొందనుంది. మరి ఈ టాక్ షోలో సెలబ్రిటీలను స్యామ్ అడిగిన ప్రశ్నలేంటీ?.. వారి ఎలా సమాధానం ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే దీపావళి వరకు వేచి చూడాల్సిందే.