బీచ్‌లో బికినీతో రెచ్చిపోతున్న సమంత

హీరోయిన్ సమంత మాల్ధీవుల్లో బికినీలతో రెచ్చిపోతోంది. ఇటీవలే బాత్‌టబ్‌లో బికినీతో ఆమె పెట్టిన హాట్ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా మరో బికినీ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ ఫొటోలో సముద్రంలో హాట్ బికినీ వేసుకుని వయ్యారంగా నడుస్తూ ఉంది. సముద్రం అందాల నడుమ సమంత మెట్లు ఎక్కుతూ ఉంది. వీటితో పాటు చెల్ల మధ్యలో దిగిన మరో ఫొటోను కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేసింది.

samantha

నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఇటీవల భర్తతో కలిసి సమంత మాల్ధీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే చైతూ బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. అనంతరం చైతూ-సమంత జంట అక్కడే ఇంకా వోకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బికినీలలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో స్యామ్ పోస్ట్ చేస్తోంది.

పెళ్లైన తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతారు. కానీ సమంత మాత్రం గ్లామర్‌తో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్‌తో పోటీ పడుతోంది. తన హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకవైపు యంగ్ హీరోల సరసన కూడా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో కూడా సమంత నటిస్తోంది. మరోవైపు టాక్ షోలు కూడా చేస్తూ స్యామ్ బిజీబిజీగా గడుపుతోంది.