డ్రగ్స్ కేసు.. ‘రకుల్ ప్రీత్ సింగ్’ కి క్షమాపణలు చెప్పిన ‘సమంత’!!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రియా చక్రవర్తి 25మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లను బయటపెట్టినట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అనేక రకాల కథనాలు రావడంతో ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా అవన్నీ అబద్దాలని తేల్చి చెప్పారు.

ఇక సమంత అక్కినేని కూడా మొదటిసారి ఈ వివాదంపై స్పందించి తారలకు మద్దతు పలికారు. సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, రోహిణి అయ్యర్, ముఖేష్ ఛబ్రా మరియు సిమోన్ ఖంబట్టా వంటి వారికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని త్వరలోనే వారిని ఎన్‌సిబి విచారించనుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక సమంత ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. సారి రకుల్ , సారి సారా అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పెషల్ పోస్ట్ చేసింది.

ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా ఫ్రీ ప్రెస్ జర్నల్‌తో మాట్లాడుతూ.. మేము బాలీవుడ్ జాబితాను తయారు చేయలేదు. ఇంతకుముందు తయారుచేసిన జాబితా పెడ్లర్లు మరియు అక్రమ రవాణాదారులకు సంబంధించింది. ఈ వార్తలు బాలీవుడ్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. అలాగే కేసును తప్పుదోవ పట్టిస్తున్నాయి. తప్పుడు వార్తలను నమ్మవద్దు.. అని ఆయన వివరణ ఇచ్చారు.