నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. కరోనా వైరస్ సంక్షోభంలో చాలా సైలెంట్ గా స్టార్ట్ అయిన ఈ షో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనసాగుతోంది. అయితే మొదటిసారి హోస్ట్ విషయంలో ఒక సమస్య వచ్చింది. ఆయన అనుకోకుండా బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వనున్నట్లు గత కొన్ని వారాలుగా వార్తలు వస్తున్నాయి.
ఇక నాగ్ స్థానంలో మరొక స్టార్ ని రప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. రమ్యకృష్ణ, రోజా, నాని, అలాగే మరికొందరు స్టార్స్ ఒక రెండు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు నాగార్జున కోడలు అక్కినేని సమంత పేరు వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 4లో శని, ఆది వారాలకు హోస్ట్ గా సమంత రాబోతుందని, ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన స్వయంగా ఆయనే సమంతను రికమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతోంది. దీంతో ఆ షూటింగ్‌లో పాల్గొనడానికి నాగార్జున తన టీంతో కలిసి మనాలీకి వెళ్ళారు. అందుకే శని, ఆది వారాలలో బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ రనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.