‘సామజవరగమన’ మరో రికార్డు

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అత్యధిక కలెక్షన్లను సొంతం చేసుకుని నాన్ బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ సినిమా విడుదలై చాలా రోజులు కావొస్తున్నా.. ఇంకా రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఇందులోని బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ తెలుగు పాటగా నిలవగా.. తాజాగా ‘సామజవరగమన’ సాంగ్ మరో రికార్డు సాధించింది.

allu arjun

‘సామజవరగమన’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో 143 మిలియన్స్ వ్యూస్ సాధించగా.. మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇటీవలే బుట్టబొమ్మ సాంగ్ 3 మిలియన్ లైక్స్ సంపాదించుకోగా.. ఇప్పుడు సామజవరగమన సాంగ్ మిలియన్స్ లైక్స్ సాధించడంపై సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇటీవలే బుట్టబొమ్మ సాంగ్ 450 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించింది. లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించడంతో పాటు ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాగా నిలిచింది.