Bollywood: స‌ల్మాన్‌ఖాన్ రాధే రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Bollywood: బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం రాధే. ఈ చిత్రానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో స‌ల్మాన్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సౌత్ కొరియ‌న్ వెట‌ర‌న్ చిత్రంకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. రీల్ లైఫ్ ప్రొడ‌క్ష‌న్ ప్రైవేట్ లిమిటెడ్, సోహాలి ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, ప్రేక్ష‌కుల్లో ఎంతో ఫిదా చేశాయి.

Radhe Movie

దీంతో ఈBollywood చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో రాధే చిత్రం గురించి స‌రికొత్త అప్‌డేట్ ను ప్ర‌క‌టించారు చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రాన్ని ఈద్ కానుక‌గా మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుందని పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు Bollywood చిత్ర‌బృందం. ఇక ఇందులో ర‌ణ‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్‌, మేఘా ఆకాశ్ త‌దిత‌రులు న‌టించిన చిత్రానికి సాజిద్ వాజిద్‌, దేవీశ్రీ‌ప్ర‌సాద్‌, హిమేష్ రేష్మియాలు స్వ‌రాలు అందించారు.