రూ.230 కోట్లకు సల్మాన్ సినిమా కొనుగోలు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సల్మాన్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించగా.. ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. జీ స్టూడియోస్ సంస్థ రూ.230 కోట్ల భారీ రేటుకు ఈ సినిమా థియేటర్, డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. తొలుత యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను కొనుగోలు చేయాలని అనుకుంది. కమిషన్ బేసిస్ మీద యశ్ రాజ్ వాళ్లు రీలీజ్ చేసేలా ఒప్పందం కుదిరింది.

salman khan

కానీ జీ స్టూడియోస్ భారీ రేటు ఆఫర్ చేయడంతో.. ఆ సంస్థకు ఇచ్చేశారు. తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రైట్స్‌ను జీ స్టూడియో సంస్థ కొనుగోలు చేసి థియేటర్లలో విడుదల చేసింది. అంతేకాకుండా జీ ఫ్లెక్స్ ఓటీటీ యాప్‌లో దీనిని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.10 కోట్ల కలెక్షన్లను సాధించింది.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా రైట్స్‌ను రూ.230 కోట్ల భారీ రేటుకు కొనుగోలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కు భారీ క్రేజ్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అయితే భారీ కలెక్షన్లు సాధించడం ఖాయం. అందుకే ఇంత భారీ రేటుకు జీ స్టూడియో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.