ఓ వైపు బిగ్ బాస్ మరోవైపు రాధే.. బిజీబిజీగా భాయ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ దిషా పటాని నుంచి రాబోయే చిత్రం రాధే. ఈ సినిమా పాట చిత్రీకరణ కోసం ఈ స్టార్స్ లోనావ్లా సమీపంలోని అంబి వ్యాలీకి వెళ్లారు. దాదాపు 6నెలల తరువాత ఈ చిత్రం సెట్స్‌పై తిరిగి వస్తున్నట్లు ప్రకటించాడు భాయ్. కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో ప్రారంభమైన 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ కోసం రాధే బృందం కర్జాత్ మరియు లోనావ్లాకు బయలుదేరింది.

ఈ బృందం కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో పాటు అక్కడే ఒక పాటను పూర్తి చేయనున్నారు. వాస్తవానికి, ఈ పాటను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాలంలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయబడలేదు. అందుకే లోనావ్లా యొక్క ఫాన్సీ కొండ నేపథ్యంలో చిత్రీకరించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇక ఈద్ సమయానికి సినిమాను తెరపైకి తీసుకురావలని ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శకుడు ప్రభుదేవా కూడా షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో కూడా మొదలవ్వడంతో పాటు వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలి కాబట్టి రాధే షూటింగ్ త్వరలోనే ఫినిష్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది.