రైతుల ఆందోళనలపై సల్మాన్ కామెంట్స్

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున గత కొద్దిరోజులుగా ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం చేపడుతున్నారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక కొంతమంది సినీ సెలబ్రెటీలు కూడా రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే ఇండియాలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఇటీవల విదేశీ సెలబ్రెటీలు కూడా ట్వీట్లు చేయడంతో.. ఈ సమస్య అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది.

SALMAN ON FORMERS PROTEST

అయితే విదేశీ సెలబ్రెటీలకు ఏం పని అని కొంతమంది విమర్శిస్తుండగా.. మరికొంతమంది మాత్రం విదేశీ సెలబ్రెటీలు ఎందుకు స్పందించకూడదు అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించాడు. సరైన పని చేయాలని, చాలా సరైన పని చేయాలని వ్యాఖ్యానించాడు. చాలా గొప్ప పని చేయాలని సల్మాన్ కామెంట్ చేశాడు.