ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం.. ఇలా చేయండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సలార్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హంబుల్ ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను కూడా నిర్మించనుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ త్వరలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత జనవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

prabahs

అయితే సలార్ సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలంటూ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని భాషలకు చెందిన వారు, అన్ని వయస్సులకు చెందిన వారు ఈ నెల 15న హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ఆడిషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్ చెప్పారు. వచ్చేటప్పుడు వన్ మినిట్‌ వీడియోతో హాజరు కావాలని వెల్లడించారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ ఆడిషన్స్‌ జరగనున్నాయి. త్వరలో బెంగళూరు, చెన్నైల్లోనూ ఆడిషన్స్‌ జరగనున్నాయని మేకర్స్ చెప్పారు. ఏమైనా సమాచార కావాలంటే 9742256454, 9885555464,90008873217 నెంబర్లను సంప్రదించవచ్చని మేకర్స్ చెప్పారు.