Salaar: స‌లార్ యూనిట్ ప్ర‌యాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ.. న‌లుగురికి గాయాలు

Salaar: ప్ర‌భాస్, ప్ర‌శాంత్‌నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న స‌లార్ చిత్రం ఇటీవ‌లే గోదావ‌రిఖ‌నిలోని బొగ్గు గ‌నిలో షూటింగ్ జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి స‌లార్ యూనిట్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. గోదావ‌రిఖ‌నిలోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ వ‌ద్ద రాత్రి ఎనిమిదిన్న‌ర స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. Salaar స‌లార్ చిత్ర యూనిట్ ప్ర‌యాణిస్తున్న కారు యూట‌ర్న్ తీసుకుంటుండ‌గా..

salaar shoot

అటుగా వ‌స్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో న‌లుగురు సిబ్బందికి స్వ‌ల్ప గాయాలయ్యాయి. కారు అద్దాలు ద్వంసమ‌య్యాయి. ఈ క్ర‌మంలో గాయ‌ప‌డ్డ వారిని వెంట‌నే స్థానిక ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అనంత‌రం సింగ‌రేణి గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోయారు. అయితే రామ‌గుండం ఓపెన్ కాస్ట్ గ‌నిలో స‌లార్ షూటింగ్ ముగించుకుని గెస్ట్ హౌస్‌కు వెళ్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది అని స‌లార్ యూనిట్ పేర్కొంది. ఇక Salaar ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై కిరంగ‌దూర్ నిర్మిస్తుండ‌గా.. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.