Salaar not Remake: సలార్ రీమేక్ కాదంటూ యూనిట్ క్లారిటీ

Salaar not Remake: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం తెలంగాణలోని గోదావరిఖనిలోని బొగ్గు గనుల సమీపంలో దీని షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభాస్ రామగుండం వచ్చిన విషయం తెలిసిందే.

salaar is not remake

అయితే సలార్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమా కన్నడ మూవీ రుద్రకు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. రుద్ర సినిమాలో మార్పులు చేసి ప్రశాత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై సలార్ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సలార్ మూవీ ఏ హాలీవుడ్ మూవీకో లేదంటే ఇంకేదో సినిమాకు సీక్వెల్ కాని రీమేక్ కాని కాదంటూ తెలియజేసింది.