Tollywood: సాయితేజ్ “రిప‌బ్లిక్” టీజ‌ర్ రిలీజ్‌..

Tollywood: మెగా హీరో సాయితేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రిప‌బ్లిక్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ప్ర‌స్థానం ఫేం దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో.. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ మేర‌కు టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

Republic teaser

ప్ర‌జా స్వామ్యం అంటే కేవ‌లం ఓటు హ‌క్కో అరిచే హ‌క్కో అనే భ్ర‌మ‌లో ఉన్నాం. కానీ క‌ట్ట‌కుండా కూలిపోతున్న వ్య‌వ‌స్థ‌లే ఆ ప్ర‌జాస్వామ్యానికి పునాదుల‌ని తెలియ‌కుండా ఇంకా ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ‌లోనే బ్ర‌తుకుతున్నాం అంటూ తేజ్ చెప్పే డైలాగ్ ఎంతో విశేషంగా అల‌రిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్‌కు జోడీగా ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా.. ఎమ్‌.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. ఎడిటింగ్ కేఎల్ ప్ర‌వీణ్. ఈ చిత్రం జూన్ 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.‌‌