Bollywood: ‘సైనా’ నెహ్వాల్ బ‌యోపిక్ ట్రైల‌ర్ రిలీజ్‌..

Bollywood: భార‌త స్టార్‌ బ్యాడ్మింటన్ హైద‌రాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న బాలీవుడ్ చిత్రం సైనా. ఈ చిత్రంలో సైనా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా పోషిస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ప్రేక్ష‌కుల్లో ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక సైనా పాత్ర కోసం Bollywood ప‌రిణీతి చోప్రా ఫిట్‌నెస్ ప‌రంగా ఎంతో శ్రమించింది.

saina Movie

పైగా బ్యాడ్మింట‌న్‌లోనూ మెళ‌కువ‌లు నేర్చుకుని సైనా పాత్ర‌కు న్యాయం చేసేందుకు ప్ర‌యత్నిస్తోంది‌. ఇక తాజాగా నేడు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ Bollywood చిత్రం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రానికి అమోల్ గుప్తే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. టీ సిరీస్ ఫిలింస్‌, ఫ్రంట్ ఫుట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ Bollywood చిత్రం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.