‘F3’లో మరో మెగా హీరో?

విక్టరీ వెంటకేష్-మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ‘F3’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన F2 సూపర్ హిట్ కావడంతో.. ‘F3’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం F3 షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

SAIDHARAM TEJ IN F3

F3లో మరో మెగా హీరో నటించనున్నాడనే వార్త ట్రెండింగ్‌గా మారింది. ఇంతకు ఆ మెగా హీరో ఎవరో కాదు.. సాయిధరమ్ తేజ్. అవును. సాయిధరమ్ తేజ్ ఇందులో గెస్ట్ రోల్ చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రీక్లైమాక్స్‌లో ఈ పాత్ర ఉంటుందని, ఇద్దరి హీరోలను ఇరకాటంలో పెట్టేలా ఈ పాత్ర ఉంటుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి.