కమెడియన్‌తో సాయిపల్లవి రోమాన్స్ చేస్తుందా?

తన నటనతో ఎంతోమందిని ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగులో నాగచైతన్య-శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటించగా.. దీని షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఇక ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న విరాటపర్వంతో పాటు పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో నటిస్తోంది.

sai pallavi romance comedian

అయితే ఈ క్రమంలో ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ కమెడియన్ కాళి వెంకట్ హీరోగా కోలీవుడ్‌లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం సాయిపల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. సాయిపల్లవి కూడా ఇందులో నటించేందుకు ఒకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.