భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలతో ఎంతోమంది కుర్రకారుని ఫిదా చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది.

sai pallavi

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ నేచురల్ బ్యూటీ రూ.2 కోట్ల ఆఫర్‌కు నో చెప్పిందట. ఒక ఫెయిర్ నెస్ యాడ్‌ను రిజెక్ట్ చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి బయటపెట్టింది. ఫెయిర్ నెస్ క్రీమ్‌ యాడ్‌లో నటించాలని ఒక కంపెనీ కోరిందని, రూ.2 కోట్లు ఆఫర్ చేశారని చెప్పింది.

‘నా సోదరి తెల్లగా, అందంగా కనిపించడం కోసం ఇష్టం లేని ఫుడ్‌ తినేది. దీంతో అందంగా లేము అనుకునేవాళ్లు సమాజంలో ఒంటరి కాదు అని నిరూపించాలనుకున్నా. నా సోదరిలో ప్రేరణ నింపడానికి ఆ యాడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా’ అని సాయిపల్లవి చెప్పింది.