సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా అప్డేట్

సాయి దుర్గ తేజ్ నాయకుడిగా రాబోతున్న SDT18 సినిమాను హనుమాన్ సినిమా నిర్మాతలు అయినటువంటి ప్రైమ్ షో వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చేసారు మేకర్స్. ఇప్పటికే రెండు పెద్ద హిట్స్ కొట్టిన సాయి దుర్గ తేజ్ పై అభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే మొదలైన SDT18 సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమా గొప్ప పిరియడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. రోహిత్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా 2025 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల విడుదల చేయడానికి చూస్తున్నారు మేకర్స్. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రెడీ అవుతుంది అని అంచనా.