సోలో బ్రతుకే సో బెటర్ స్టార్ట్ అయ్యింది, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

sai dharam tej new movie launch

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మారుతీతో కలిసి ప్రతి రోజు పండగే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో, తేజ్ తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది మే 1న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ పక్కన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.