కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ నెవర్ బిఫోర్ అనేలా కష్టాలను ఎదుర్కొంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్స్ దాదాపు ఏడెనిమిది నెలలు కెమెరా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా తగ్గకపోయినా కూడా జనాలు మాత్రం మళ్ళీ రెగ్యులర్ లైఫ్ కి వచ్చేశారు. ఇక సినిమాలను కూడా రిలీజ్ చేస్తే బావుంటుందని కొందరు హీరోలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది రిస్క్ తో కూడుకున్న పని.
అందుకే పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కూడా పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదని అర్ధమవుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే అంధరికంటే ముందు మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఇంకా విడుదల కాలేదు నవంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు గాని వర్కౌట్ అయ్యేలా లేదని అనిపిస్తోంది. ఇక ఫైనల్ గా డిసెంబర్ లో క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.