‘సాయి ధరమ్ తేజ్’ రిపబ్లిక్ మూవీలోని డైలాగులు వైరల్ !!

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలాగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయని నెట్టింట రిపబ్లిక్ మూవీలోని సాయి ధరమ్ తేజ చెప్పిన డైలాగులను షేర్ చేశారు. “ప్రతి ఎలక్షన్లలో తను ఓటేసిన పొలిటిషన్ జీవితాన్ని మార్చేస్తానని ఆశించే ఓటర్. దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్.” అంటూ సాగే డైలాగ్ రిపబ్లిక్ మూవీ లోనిది. ఈ డైలాగ్ కి సంబంధించిన సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఆ డైలాగులు ప్రతిబింబంగా ఉండడం గమనార్హం. అలాగే ప్రస్తుత రాజకీయ కోణంలో చూస్తే ప్రతి ఓటరు తన ఓటేసిన నాయకుడు ఏదో చేస్తాడని ఆశించడం అలాగే నాయకుడు తను బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేస్తూ తన స్వలాభం కోసం పనిచేయడం. ప్రజల కోసం పనిచేసే నాయకులు లేరు అన్న నమ్మకంతో తన ఓటుని అమ్ముకుంటున్న ఓటర్ ఇలా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా లోని డైలాగులు అన్నీ కూడా ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా ఉండడం ప్రజలందరూ కూడా దాన్ని నెట్టింట వైరల్ చేయడం జరుగుతోంది.