ప్రతి రోజు పండగల జరిగిన షూటింగ్ గుమ్మడికాయ కొట్టేశారా?

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండగే. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మారుతీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మొదటి పాట రిలీజ్ అయ్యి మంచి ఫీల్ గుడ్ సాంగ్ అనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యింది. బాలన్స్ ఉన్న ఒక్క సాంగ్ ని త్వరలో షూట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెట్టడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

prathi roju pandage

ఇటీవలే అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు, దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. తాత మనవడి మధ్య జరిగే అందమైన కథగా రూపొందుతున్న ప్రతి రోజు పండగే సినిమాలో కట్టప్ప(సత్యరాజ్), రావు రమేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ కానుంది. ప్రతి రోజు పండగే రిలీజ్ అవగానే తేజ్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సెట్స్ లో జాయిన్ అవనున్నాడు.