సోలో బ్రతుకే సో బెటరు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకోని సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అదే ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ తేజ్, ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతితో కలిసి ప్ర‌తిరోజూ పండ‌గే మూవీ చేస్తున్నాడు. సత్యరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది. ప్రతిరోజు పండగే సినిమా సెట్స్ పై ఉండగానే, తేజ్ తన నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో సుబ్బ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజ్ పక్కన ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ క్రేజి కాంబినేషన్ కి సోలో బ్రతుకే సో బెటరు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన మ‌నీ సినిమాలో భ‌ద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు అనే పాటలోని ప‌ల్ల‌వి నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ ప్ర‌తిరోజూ పండగే సినిమాతో డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.