బ్యాచిలర్స్ కి సాయి ధరమ్ తేజ్ సోలో పాఠాలు

చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ అందుకోని సక్సస్ ట్రాక్ ఎక్కిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రతిరోజు పండగే. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కంప్లీట్ ఎంటర్టైనర్ సెట్స్ పై ఉండగానే తేజ్ మరో సినిమాని మొదలుపెట్టాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాని ఫిక్స్ చేశారు.

sai dharam tej new movie launch

యూత్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి జరుగనుంది. థమన్ మ్యూజిక్, వెంకట్ సి దిలీప్ ఫోటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.