సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజునే ప్రతి రోజు పండగే స్పెషల్ వీడియో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. తన లుక్ మొత్తం చేంజ్ చేసి సరికొత్త సుప్రీమ్ హీరోని చూపించిన తేజ్, చిత్రలహరి ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ప్రతి రోజు పండగే సినిమాని చేస్తున్నాడు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మేకింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తేజ్, సత్యరాజ్ ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినీ అభిమానులని ఆకట్టుకున్నారు.

prathi roju pandage

యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్2 కలిసి నిర్మిస్తున్న ప్రతి రోజు పండగే సినిమాలో తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ప్రతి రోజు పండగే సినిమా నుంచి గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ ఉన్న ఈ పోస్టర్ చాలా లైవ్లీగా ఉంది. కుటుంబ బంధాలకి విలువిచ్చే కథతో మారుతీ ప్రతి రోజు పండగే సినిమాని తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.