విదేశీ సెలబ్రెటీలపై సచిన్ ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దేశ రైతులు గత కొంతకాలంగా పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక పలువురు సెలబ్రెటీలు కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

sachin on tweets

అయితే రైతుల ఉద్యమంపై ఇతర దేశాలకు చెందిన సెలబ్రెటీలు ట్వీట్లు చేయడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఆ ట్వీట్లన్నీ ఖచ్చితత్వం లేని ట్వీట్స్ అని, బాధ్యతరాహిత్యమైన ట్వీట్లు అని మండిపడింది. భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడానికి కొన్ని శక్తులు ఇలాంటి పనులకు తెరతీస్తున్నాయని, ఈ శక్తులే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను కూడా ధ్వంసం చేశాయంది. ఈ క్రమంలో విదేశీ సెలబ్రెటీల ట్వీట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ల మద్దతు ఇండియన్లకేనని స్పష్టం చేసిన ఆయన.. విదేశీ సెలబ్రెటీల ట్వీట్లను ఖండించాడు.