వరల్డ్ క్లాస్ హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ”సాహో” కు U/A సెన్సార్ సర్టిఫికెట్…

వరల్డ్ క్లాస్ హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్  సాహో కు U/A సెన్సార్ సర్టిఫికెట్…. ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడి అవుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. 


అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది సాహో.  హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది… అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు.

ప్రభాస్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ల లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు:
ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు                                                                                                                        
 సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్
నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్
సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా
నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది 
ఎడిట‌ర్: ఏ శ్రీక‌ర్ ప్ర‌సాద్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను