RV ఫిల్మ్ హౌస్ బ్యానర్ మీద ‘కొక్కొరోకో’

దర్శక, నిర్మాతగా రమేష్ వర్మకి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌‌ను ఎంకరేజ్ చేసేందుకు RV ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌ని రమేష్ వర్మ ప్రకటించారు. శ్రీనివాస్ వసంతల అనే ఓ నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోన్నారు.

రమేష్ వర్మ నిర్మాణంలో శ్రీనివాస్ వసంతల దర్శకత్వంలో ‘కొక్కొరోకో’ అనే ప్రాజెక్ట్ రాబోతోంది.కి ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలని భావిస్తున్నారు, దృశ్య ప్రకాశాన్ని ఎమోషనల్ డెప్త్‌తో మిళితం చేశారు. ప్రముఖ రచయిత జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు అయిన సాగర్ ఈ చిత్రానికి రైటర్‌గా పని చేస్తున్నారు. ఆల్రెడీ రాక్షసుడు చిత్రానికి సాగర్ రైటర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. తండ్రి వారసత్వాన్ని సాగర్ ఇలా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాష్ ఆర్ జోషి , మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రేఖ వర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తుండగా.. నీళ్లాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.

కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ అందిస్తున్నారు. RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై మొదటి చిత్రంగా కొక్కొరొకో అంథాలజీని పరిచయం చేయబోతోన్నారు. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలను చూపించే స్క్రీన్‌ప్లేతో సరికొత్తగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.