సుకుమార్ బన్నీ సినిమాపై వస్తున్నవి ఉత్త పుకార్లు మాత్రమే

ఆర్య, ఆర్య2… అల్లు అర్జున్ ని కొత్తగా ప్రెజెంట్ చేసిన సినిమాలు. ప్రేమకథలకు కొత్త మీనింగ్ చెప్పిన ఈ రెండు చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఇద్దరి కలయికలో మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల క్రితం ఈ హ్యాట్రిక్ సినిమా అనౌన్స్ అయినా కూడా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అల వైకుంఠపురంలో అయిపోయాక బన్నీ ఐకాన్ మొదలుపెడతాడా లేక సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.

bunny sukumar cinema

సుకుమార్-బన్నీ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చాలా రోజులుగా స్క్రిప్ట్ పైన వర్క్ చేసిన సుకుమార్, రీసెంట్ గా ఫైనల్ వెర్షన్ న్యారేషన్ ఇచ్చాడని సెకండ్ హాఫ్ లో బన్నీ కొంచెం చేంజెస్ చెప్పాడని అంటున్నారు అయితే ఇందులో నిజంలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ పూర్తిగా అల వైకుంఠపురంలో షూటింగ్ బిజీలోనే ఉన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ సినిమా పైనే ఉంది. సో సుకుమార్ బన్నీ సినిమా గురించి వినిపిస్తున్నవన్నీ ఉత్త పుకార్లు మాత్రమే.