రూలర్ టీజర్ తో రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య…

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రూలర్. జై సింహా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కేఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. పోస్టర్స్ తోనే బాలయ్యని కొత్తగా చూపించి అలరించిన చిత్ర యూనిట్, ప్రొమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. ధర్మగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన బాలకృష్ణ, పవర్ఫుల్ గా కనిపించాడు. మరో లుక్ లో బాలకృష్ణ ముందెన్నడూ చూడనంత స్టైలిష్ గా కనిపించాడు. ఈ రెండు పాత్రల్లో పోలీస్ పక్కన వేదిక హీరోయిన్ గా నటిస్తుండగా, మరో పాత్ర పక్క సోనాల్ చోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ట్రీట్ ఆ కట్ చేసిన టీజర్ లో బాలయ్యతో పాటు ప్రకాష్ రాజ్, జయసుధలతో పాటు భూమిక కూడా కనిపించారు. బాలకృష్ణని ఊరమాస్ గెటప్ లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది పండగలాంటి సినిమా. ఈ డిసెంబర్ 20కి జై బాలయ్య నినాదంతో థియేటర్స్ మారుమోగిపోనున్నాయి.