‘RRR’ అభిమానులకు సర్‌ప్రైజ్.. దీపావళి కానుక వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమాలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు RRR యూనిట్ సర్‌ప్రైజ్ అందించింది.

RRR

రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ సంప్రదాయ దుస్తుల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటోలను RRR యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే దీపావళి సందర్బంగా రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి సినిమాకు సంబంధించిన సమాచారం గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు దానికి సంబంధించినవే అని తెలుస్తోంది. రేపు ఫుల్ వీడియోను విడుదల చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

డీవీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు