RRR విడుదల తేదీని లీక్ చేసిన నటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ల కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొంది. మాములుగా రాజమౌళి సినిమా షూటింగ్‌కు చాలా సమయం తీసుకుంటారు. ఇక లాక్‌డౌన్ వల్ల మొన్నటివరకు షూటింగ్‌లు ఆగిపోవడంతో.. RRR సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆ ఎఫెక్ట్ RRR రిలీజ్‌పై పడింది.

RRR RELEASE DATE

ఈ క్రమంలో RRR ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. తాజాగా ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ RRR రిలీజ్ తేదీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బయటపెట్టింది. అక్టోబర్ 8వ తేదీన RRR విడుదల అవుతుందంటూ ప్రకటించింది. అయితే కొద్దిగంటల్లోనే దానిని డిలీట్ చేసింది. అయితే అప్పటికే దానికి కొద్దిమంది స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు. కాగా అలిసన్ డూడీ RRRలో ముఖ్యపాత్రను పోషిస్తోంది.