RRR: అల్లూరి సీతారామ‌రాజు పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం!

RRR: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండ‌గా.. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మ‌రో బ‌ల‌మైన పాత్ర కొమురం భీంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్ల్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

RRR

కాగా రేపు రాంచ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఒక్క‌రోజు ముందే మెగాభిమానుల‌ను ఫిదా చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి అల్లూరి సీతారామ‌రాజు(రాంచ‌ర‌ణ్‌) పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్‌లో రాంచ‌ర‌ణ్ ఎంతో అల‌రిస్తున్నాడు.. చూడ‌గ్గానే గూస్‌బంప్స్ వ‌చ్చేలా ఉంది ఈ పోస్ట‌ర్‌. చేతిలో బాణం పైకి ప‌ట్టుకుని విల్లు వేస్తున్న చ‌ర‌ణ్ ఓ రేంజ్‌లో క‌నిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. RRR ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.‌