RRR: రిలీజ్ కాక‌ముందే ఆర్ఆర్ఆర్ అన్నీ కోట్లా బిజినెస్ ఆ..

RRR: ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ట్లు తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్ల్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

RRR updates

ఇక ఇప్ప‌టికే ఈ RRR చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్స్‌, ప్రేక్ష‌కుల‌ను ఎంతో విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌రుగుతోంద‌ని స‌మాచారం. థియేట్రిక‌ల్ రైట్స్‌, డిజిట‌ల్ శాటిలైట్‌, ఓవ‌ర్సీస్‌.. అన్నీ క‌లిపి ఏకంగా 900కోట్ల బిజినెస్ చేసిన‌ట్టుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ RRR చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 13న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ కీర‌వాణీ అందిస్తున్నారు.