RRR Oscar రేసులో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ (Oscars) అవార్డు రేసులో నిలిచింది. 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన సినిమాల జాబితాని మంగళవారం ప్రకటించారు. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది. ఇటీవల కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ’లో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.

ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు రాజమౌళి గారికి మరియు మొత్తం RRR టీమ్‌కి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అభినందనలు.