RRR: ఆర్ఆర్ఆర్ డిజిట‌ల్ హ‌క్కుల‌కు భారీ రేటు ప‌లికిన మూవీటీం..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయ‌న సినిమాల‌కు అంత‌ర్జాతీయ స్థాయి మార్కెట్ ఏర్ప‌డ‌డంతో బ‌డ్జెట్ వంద‌ల కోట్ల‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి త‌గ్గ‌ట్టు బిజినెస్ కూడా అదే స్థాయిలో జ‌రుగుతోంది. ఈ చిత్రానికి సుమారు 400కోట్లు ఖ‌ర్చు అవుతున్న‌ట్టు స‌మాచారం. ఇక తాజాగా RRRఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతుంది. డిజిట‌ల్ హ‌క్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోయిన‌ట్టు వార్తాలు వెలువ‌డుతున్నాయి..

RRR Updates

డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం ఓటీటీ హ‌క్కుల‌ను సుమారు 200కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ RRRచిత్రం పాన్ ఇండియా స్థాయిగా తెర‌కెక్కుతున్న నేప‌థ్యంలో అన్ని భాష‌ల్లో డిస్నీ హాట్‌ స్టార్ లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ‌ప్ర‌సారం చేస్తార‌ట. ఇక ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నారు.. అలాగే చెర్రీకి జోడీగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభ‌ట్ న‌టిస్తుండ‌గా.. తార‌క్ జోడీగా హాలీవుడ్ న‌టి ఓలీవియా మోరీస్ న‌టిస్తుంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఇక ఈ RRR:చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ‌‌‌