RRR: త్వ‌ర‌లో రాంచ‌ర‌ణ్ మ‌రో ఉగ్ర‌రూపం చూస్తారు.. ఆర్ఆర్ఆర్ టీం!

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ టీజ‌ర్లు ఓ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.. అలాగే దీంట్లో హీరోయిన్ల్‌గా న‌టిస్తున్న హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌, బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి.. ఈRRR చిత్రం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా మార్చి 27న రాంచ‌ర‌ణ్ జ‌న్మ‌దినం..

RRR Latest

ఆ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఆ రోజున రామ్ చ‌ర‌ణ్ మ‌హోగ్ర‌రూపాన‌ని చూస్తార‌ని చిత్ర‌యూనిట్ వెల్ల‌డించింది.. రామ‌రాజు వ‌స్తున్నాడు అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు ఈ చిత్రానికి. ఈ RRR సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌