ఆర్ఆర్ఆర్ కోసం హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌.. ఓ రేంజ్‌లో క్లైమాక్స్ అంటూ ట్వీట్‌!

ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే త‌న చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగించేలా రాజ‌మౌళి ఎంతో క‌ష్ట‌ప‌డ‌తాడు.. ప్ర‌తి స‌న్నివేశాన్ని ద‌గ్గరుండి మ‌రీ అన్నీ తానే అన్న‌ట్లు శ్ర‌మిస్తారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం క్లైమాక్స్ ద‌శ‌కు చేరుకుంది.. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా, రాంచ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా న‌టిస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. కాగా క్లైమాక్స్ లో జ‌రిగే ఫైట్ సీన్ కోసం ఏకంగా హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌ను రంగంలోకి దించారు రాజ‌మౌళి. ఆయ‌న గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఈ విష‌యాన్ని తాజాగా వీడియో ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది చిత్ర‌బృందం.

RRR Updates

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో ఊపు లేద‌ని మీర‌నుకుంటుండొచ్చు.. ఇదిగో హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ నిక్‌పావెల్ అంటూ పేర్కొంది.. ఈ వీడియోలో హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్‌తో ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళికి సూచ‌న‌లు ఇస్తూ క‌నిపిస్తారు. ఇక నిక్ పావెల్ గురించి తెలుసుకుందాం.. నిక్ పావెల్ గ‌తంలో బ్రేవ్ హార్ట్‌, గ్లాడియేట‌ర్‌, మ‌మ్మీ, ది లాస్ట్ స‌మురాయ్‌, సిండ్రెల్లా మ్యాన్ వంటి చిత్రాల‌కు పోరాట స‌న్నివేశాలు రూప‌క‌ల్ప‌న చేసి విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు అందుకున్నాడు. నిక్ పావెల్ బాలీవుడ్‌లో మ‌ణిక‌ర్ణిక చిత్రానికి కూడా స్టంట్స్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు.‌‌