RRR: ఆలియా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది.. ఆర్ఆర్ఆర్ టీం స‌రికొత్త అప్‌డేట్‌!

RRR: ద‌ర్శ‌క‌దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా పోషిస్తున్నారు. అలాగే తారక్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ న‌టిస్తుండ‌గా.. చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ న‌టిస్తుంది. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, చ‌ర‌ణ్-ఎన్టీఆర్ టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. ఈ RRR చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతుండ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

rrr movie

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. ఇందులో ఆలియా భ‌ట్ సీత అనే పాత్ర‌ల్లో పోషిస్తుండ‌గా.. ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఈ నెల 15న 11గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ప్ర‌ముఖ న‌టి శ్రియ శ‌ర‌ణ్ త‌దిత‌రులు న‌టిస్తున్నRRR చిత్రానికి ఎం.ఎం. కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.