RRR: పులితో యంగ్ టైగ‌ర్ ఫైట్ సీన్ స్టిల్ లీక్..

RRR: ద‌ర్శ‌క దిగ్గజ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నర‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తుండ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. కాగా ఈ చిత్రంలోని పులితో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫైట్ ఉంటుందన మొద‌ట్లో చిత్ర‌బృందం తెలిపిన విష‌యం తెలిసిందే..

RRR Ntr

అయితే ఈ ఫైట్ సీన్ కు సంబంధించిన కీల‌క‌మైన ఫోటో లీక్ అయి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో RRR ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇక ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ న‌టిస్తుంది.. అలాగే ఈ RRRచిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ కూడా న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణీ ఈRRR చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నాడు.