భారి ధరకి ఆర్ ఆర్ ఆర్ మ్యూజిక్ రైట్స్…

పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ప్రేస్టిజియస్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ డివా అలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగన్ లాంటి స్టార్ కాస్ట్ కలిసి నటిస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఇస్తూ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ బిసినెస్ ని ఎప్పుడో కంప్లీట్ చేశాడట. తాజాగా ట్రిపుల్ ఆర్ మ్యూజిక్ రైట్స్ ని భారి ధరకి అమ్ముడుపోయాయి. ఆర్ఆర్ఆర్ మ్యూజికల్‌ రైట్స్ ను లహరి మ్యూజిక్ కంపెనీ రూ.25 కోట్లకు దక్కించుకుంది. హిందీతో పాటు దక్షిణాది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ మ్యూజిక్ రైట్స్ ని టి సిరీస్ అండ్ లహరి మ్యూజిక్ సొంతం చేసుకున్నారు. ఒక సినిమా ఆడియో ఇది రికార్డు ప్రైస్ అనే చెప్పాలి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 1న ఉదయం 11 గంటలకి ఆర్ ఆర్ ఆర్ నుంచి దోస్తీ అనే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ పాటని ఒక్కో భాషలో ఒక్కో బెస్ట్ సింగర్ పాడడం విశేషం.

ఫిక్షనల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటించగా, రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించింది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పలు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.