Roja: న‌న్ను న‌ల్ల‌గా ఉన్నావ‌ని అంద‌రూ ఎగ‌తాలి చేసేవారు: రోజా

Roja: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అప్ప‌ట్లో అగ్ర క‌థానాయిక‌గా గుర్తింపు ఉన్న హీరోయిన్‌గా రోజా సంపాదించుకుంది. ఆమె గ్లామ‌ర‌స్ న‌ట‌న‌తో సినీ ప్రేక్ష‌కుల్లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా సౌతిండియా సినీ, టీవీ మేక‌ప్ ఆర్టిస్ట్‌, హెయిర్ స్టైలిస్ట్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి రోజా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ ప‌రిశ్ర‌మ‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేసింది Roja.

తాను సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో న‌న్ను న‌ల్ల‌గా ఉన్నావు అని.. సినిమాల్లో ఎలా రాణిస్తావ‌ని అంద‌రూ ఎగ‌తాళి చేసేవారు అని అన్నారు. కానీ.. మేక‌ప్ ఆర్టిస్టుల కార‌ణంగానే తాను అందంగా క‌నిపించాన‌ని చెప్పారు. అలాగే త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ Roja త‌న‌కు పుట్టినిల్లు వంటిద‌ని అన్నారు. దివంగ‌త జ‌య‌లలిత‌, ఎంజీఆర్ ల‌ను త‌లుచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మ‌విశ్వాసం క‌లుగుతుందని ఆమె అన్నారు. ఒక సారి జ‌య‌ల‌లిత‌గారిని క‌లిసిన‌ప్పుడు ఒక‌మాట త‌న‌కు చెప్పారు.. సినీ ప‌రిశ్ర‌మ క‌రెంట్ లాంటిద‌ని.. సరిగా వినియోగిస్తే వెలుగునిస్తుంద‌ని.. లేక‌పోతే షాక్ కొడుతుంద‌ని జ‌య‌ల‌లిత గారు చెప్పార‌ని తెలిపింది రోజా. ఇక ఈ కార్య‌క్ర‌మానికి రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి కూడా హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ప్ర‌స్తుతం Roja రోజా వైసీపీ ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నారు.