సింబా తర్వాత ‘సర్కస్’ కోసం సిద్దమైన బెస్ట్ కాంబినేషన్

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి మరోసారి చేతులు కలిపిన న్యూస్ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింబా సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక రోహిత్ శెట్టి, రణ్‌వీర్ సింగ్ చిత్రనిర్మాత భూషణ్ కుమార్‌తో కలిసి ఫోటోషూట్ ద్వారా పోజులిచ్చారు. ఈ చిత్రానికి సిర్కస్ అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తో పాటు పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ లో డబుల్ రోల్ లో నటించనున్నారు.
రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేయడం ఇదే మొదటిసారి. సర్కస్ చిత్రం 80లో హిట్టయిన సూపర్ హిట్ చిత్రం అంగూర్ యొక్క రీమేక్ అని చెప్పేశారు. అంగూర్ చిత్రంలో సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ముంబైలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని 2021 శీతాకాలం నాటికి మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సర్కస్‌ సినిమాను రోహిత్ శెట్టితో పాటు భూషణ్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి.