బిగ్‌బాస్‌-4 విజేత అభిజిత్‌కు రోహిత్‌శ‌ర్మ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

బిగ్‌బాస్‌-4 విన్న‌ర్‌ అభిజిత్‌కు టీంఇండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శ‌ర్మ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించాడు. వివ‌రాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌-4 సీజ‌న్‌లో గెలిచినందుకు అభిజిత్‌కు ఫోన్ చేసి మాట్ల‌డ‌ట‌మే కాకుండా.. ప్రేమ‌తో త‌న జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు రోహిత్‌శ‌ర్మ‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అభిజితే త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న గురించి రోహిత్‌శ‌ర్మ‌కు తెలిపిన హ‌నుమ‌విహారికి ధ‌న్య‌వాదాలు అని తెలిపాడు.

abhijith

అలాగే తాను ఎంతో అభిమానించే క్రికెట‌ర్ నుంచి త‌న‌కు గిఫ్ట్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోహిత్‌శ‌ర్మ, హ‌నుమ విహారికి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లో బిగ్‌బాస్ షో గురించి చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని.. త‌న గురించి రోహిత్‌కు హ‌నుమ విహారి చెప్పాడ‌ని తెలిపాడు అభిజిత్‌. అంతేకాకుండా అత‌ను త‌న‌కు పెద్ద ఫ్యాన్ అనే విష‌యాన్ని కూడా చెప్పాడు అని.. ఈ నేప‌థ్యంలోనే రోహిత్‌శ‌ర్మ త‌న‌కు ఫోన్ చేసి విజేత‌గా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడ‌ని అభిజిత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. ఇదిలా ఉంటే రోహిత్‌శ‌ర్మ మ‌హారాష్ట్రలోనే పుట్టిపెరిగిన‌ప్ప‌టికీ.. తెలుగు మూలాలు తెలుగు గ‌డ్డ‌పై ఉన్నాయి. రోహిత్ శ‌ర్మ అమ్మ పూర్ణిమ విశాఖ‌పట్నం అన్న విష‌యం తెలిసిందే.