Riya Chakravarthy: ప్లీజ్.. ఫాలో కావొద్దంటూ దండం పెట్టిన బాలీవుడ్ నటి

Riya Chakravarthy:సు శాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తి బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఒక దుకాణంలో పూల బొకే కొనుగోలు చేసేందుకు కారు దిగింది. దీంతో స్థానికులు ఆమెను గుర్తుపట్టి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇది చూసిన రియా చక్రవర్తి.. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వొద్దు. వీడియోలు, ఫొటోలు తీయకండి అని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

RIYA CHAKRAVARTHY VIRAL VIDEO

దండం పెడుతూ వీడియోలు తీయవద్దని కోరింది. ఈ వీడియోలో ముఖానికి మాస్కు పెట్టుకుని, వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించి కనిపించింది. జ‌న‌వ‌రి 21న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జ‌యంతి సంద‌ర్భంగా రియా చ‌క్ర‌వ‌ర్తి పూలు కొన్నట్లు తెలుస్తోంది. కాగా డ్రగ్స్ కేసులో కొద్దిరోజులపాటు జైల్లో గడిపిన రియా చక్రవర్తి.. ఇటీవల బెయిల్‌పై బయటికొచ్చింది.