నవ్విస్తూ భయపెడుతుంది – హీరోయిన్ రితిక చక్రవర్తి

మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో, మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా రితిక చక్రవర్తితో ఇంటర్వ్యూ…

RITIKA SINGH

‘నేను ఈ చిత్రంలో సుజి పాత్రలో నటించాను. షకలక శంకర్ గారి వైఫ్ రోల్ లో కనిపిస్తాను. డైరెక్టర్ కుమార్ కోట గారికి ఇది మొదటి సినిమా అయినా చాలా కష్టపడి పని చేశారు.షకలక శంకర్, దర్శక,నిర్మాతల సహకారం మరచిపోలేము. మేమందరం ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లి వచ్చినట్లు సినిమాను పూర్తి చేయగలిగాం.మేమంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాము.ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ బొమ్మ అదిరింది దిమ్మతిరిగింది సినిమాలో చిన్న హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నటించిన మొదటి సినిమా అయినా సెట్స్ లో అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. తెలుగులో నేను ఒక మంచి సినిమాతో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నపుడు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. త్వరలో వాటి వివరాలు తెలుపుతాను’ అన్నారు.